Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

అనంతపురం జిల్లాలో ఈ తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. గోరంట్ల మండల పరిధిలోని బూచేపల్లి బస్ స్టాప్ వద్ద ఆటో, లారీ ఢీకొన్న ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మరో నలుగురు తీవ్ర గాయాల పాలయ్యారు. మృతులందరూ పుట్టపర్తి మండలం పెడబల్లికి చెందిన వారుగా గుర్తించారు. మృతి చెందిన వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. వీరంతా కూలి పనుల కోసం కర్ణాటకలోని బాగేపల్లి మార్కెట్ కు ఆటోలో వెళుతుండగా ఈ దారుణం సంభవించింది. బెంగళూరు నుంచి తాడిపత్రి వస్తున్న లారీ ఎదురుగా వచ్చి ఆటోను ఢీకొంది. క్షతగాత్రులను హిందూపురం ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.

More Telugu News